Brahmaji: బౌన్సర్ల పై అసహనం వ్యక్తం చేసిన బ్రహ్మాజీ..! 1 d ago
సినీ నటుడు బ్రహ్మాజీ తాజాగా పెట్టిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. "ఎక్కడ చూసినా బౌన్సర్లు.. బౌన్సర్లు. వాళ్ళ ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవడం లేదు. ఏం చెయ్యాలి.. అవుట్ డోర్స్ లో అంటే పర్వాలేదు. సెట్స్ లో కూడానా..?" అని బ్రహ్మాజీ రాసుకొచ్చారు. బౌన్సర్లను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు ఎవరి బౌన్సర్లను ఉద్దేశించి చేశారనేది ఆయన చెప్పలేదు.